వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్..
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:54 AM
అమెరికా-ఇరాన్ మధ్య దోహా వేదికగా జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయనే అంచనాల నేపథ్యంలో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య దోహా వేదికగా జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయనే అంచనాల నేపథ్యంలో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండ్రోజులుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.96) బలపడింది. ఇన్ని సానుకూలాంశాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,922)తో పోల్చుకుంటే గురువారం ఉదయం స్వల్ప లాబాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల లాభంతో 77,415 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 143 పాయింట్ల లాభంతో 24,149 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కోఫోర్జ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫో ఎడ్జ్, ఎంఫసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). వెర్నోవా టీడీ, అవెన్యూ సూపర్ మార్కెట్, హిటాచీ ఎనర్జీ, భెల్, సీజీ పవర్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 169 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్