మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 750 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:00 PM
వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు సూచీలను వెనక్కి లాగాయి.
వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు సూచీలను వెనక్కి లాగాయి. ఈ త్రైమాసికంలో ఐటీ స్టాక్స్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండొచ్చనే అంచనాల ఫలితంగా ఐటీ సెక్టార్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (79,273)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 250 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 756 పాయింట్ల నష్టంతో 78,516 వద్ద రోజును ముగించింది. మళ్లీ 79 వేల మార్క్ దిగువకు పడిపోయింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 198 పాయింట్ల నష్టంతో 24,378 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఇండియన్ రెన్యుబుల్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, మదర్సన్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). హెచ్‌సీఎల్ టెక్, టాటా ఎలాక్సీ, 306 వన్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 114 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.79గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలు ఇప్పట్లో లేనట్టేనా.. పాక్ పర్యటనపై వైట్‌హౌస్ కీలక ప్రకటన..
పహల్గాం ఘటన తర్వాత కీలక పరిణామం.. పాక్ ఉగ్రవాదులు-హమాస్ మధ్య బలపడిన బంధం..