Share News

భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు.. మార్కెట్లకు తప్పని నష్టాలు..

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:56 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ధర 84.60 డాలర్లకు చేరుకుంది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.3062 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు.. మార్కెట్లకు తప్పని నష్టాలు..
Stock Market

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ధర 84.60 డాలర్లకు చేరుకుంది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.3062 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇక, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.20) భారీగా పతనమైంది. మరోవైపు బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం కూడా సెన్సెక్స్, నిఫ్టీలను వెనక్కి లాగింది. (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,616)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివరకు సెన్సెక్స్ 561 పాయింట్ల నష్టంతో 77,054 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 158 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో బయోకాన్, కంటైనర్ కొర్పొరేషన్, అదానీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). హెచ్‌సీఎల్ టెక్, లోధా డెవలపర్స్, టాటా ఎలాక్సీ, ఎన్‌బీసీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో నడిచాయి. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 274 పాయింట్లు కోల్పోయింది.


ఇవి కూడా చదవండి..

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్


యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

Updated Date - Jul 14 , 2026 | 04:04 PM