మళ్లీ నష్టాల బాటలోకి.. సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Mar 11 , 2026 | 10:35 AM
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.4,673 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్‌గా మారింది.
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.4,673 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్‌గా మారింది. అలాగే మంగళవారం లాభాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఇరాన్ యుద్ధం కొనసాగుతూ ఉండడం నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (78,205)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మళ్లీ 78 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 502 పాయింట్ల నష్టంతో 77,745 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 136 పాయింట్ల నష్టంతో 24,125 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బ్లూ స్టార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, నాల్కో, సోనా బీఎల్‌డబ్ల్యూ, సెయిల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోల్గేట్, కేఈఐ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, మారికో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 419 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 65 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..