మూడో రోజూ లాభాలే.. 350 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ ..
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:10 PM
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.
వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు లాభాలతోనే ముగిశాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.53) బలపడడం దేశీయ సూచీలకు సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,808)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 96 పాయింట్ల లాభంతో 24,085 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ట్రెంట్, భారత్ డైనమిక్స్, వెర్నోవా టీడీ, యస్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాలను ఆర్జించాయి (share market news). టీఎమ్‌పీవీ, బీఎస్‌ఈ లిమిటెడ్, కోల్గేట్, లోథా డెవలపర్స్, సమ్మన్ క్యాపిటల్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 187 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు ఆర్జించింది.
ఇవి కూడా చదవండి..
మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..
సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..