Share News

ఇలాగైతే కంపెనీలు మూసేయాల్సిందే: విమానయాన సంస్థల ఆందోళన

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:44 PM

విమాన ఇంధనం (ATF) ధరలు విపరీతంగా పెరగడం వల్ల భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో కుదేలవుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఆదుకోకుంటే కంపెనీలు మూసివేయడమో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదని అంటున్నాయి.

ఇలాగైతే కంపెనీలు మూసేయాల్సిందే: విమానయాన సంస్థల ఆందోళన
Inaidna Airlines

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ATF) ధరలు విపరీతంగా పెరగడం వల్ల భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో కుదేలవుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఆదుకోకుంటే కంపెనీలు మూసివేయడమో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదని అంటున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రధాన విమానాయాన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (FIA) ఈమేరకు సివిల్ ఏవియేషన్ కార్యదర్శికి తాజాగా లేఖ రాసింది. ఎయిర్‌లైన్స్ ఆపరేషన్లు కొనసాగించాలంటే కేంద్రం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరింది.


అసాధారణ రీతిలో పెరిగిపోతున్న జెట్ ఇంధనం ధరలతో దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఆపరేషన్లు అసాధ్యంగా, అస్థిరంగా మారుతున్నాయని ఎఫ్ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విమానయాన సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లకు గురువుతున్నాయని తెలిపింది. తక్షణం ప్రభుత్వం సాయం అందకుంటే కంపెనీలు మూతపడడటం కానీ, ఆపరేషన్లు నిలిపివేయడం కానీ అనివార్యం కావచ్చని పేర్కొంది.


రెండు నెలలుగా ఇరాన్ యుద్ధం కొనసాగుతుండటంతో క్రూడాయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఏటీఎఫ్‌తో సహా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. విమానాల విడిభాగాలు, లీజు చెల్లింపులు ఖరీదైనవిగా మారుతున్నాయి. టిక్కెట్ ధరలపై తీవ్రమైన పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గుతున్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం ధరల్లో పెరుగుదల ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసి, నిర్వహణ తలకుమించిన భారమవుతోందని చెబుతున్నాయి. 'ఎయిర్‌లైన్ ఆపరేషన్లు కొనసాగాలన్నా, సంస్థలు మనుగడ సాగించాలన్నా, ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలన్నా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. అర్ధవంతమైన ఆర్థిక సాయం ప్రకటించాలి' అని సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి రాసిన లేఖలో ఎఫ్ఐఏ కోరింది.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 28 , 2026 | 04:49 PM