అమెరికాతో మళ్లీ వాణిజ్య చర్చలు.. వాషింగ్టన్‌కు భారత బృందం..
ABN , Publish Date - Apr 15 , 2026 | 09:33 PM
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేయబోతోంది. ఈ నెలలో భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్‌కు వెళ్లి చర్చలు జరపనుంది. అమెరికాలో మారుతున్న టారిఫ్ విధానాలు, అంతర్జాతీయంగా సరఫరా గొలుసుల్లో వచ్చిన అంతరాయాల నేపథ్యంలో జరగబోయే ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేయబోతోంది. ఈ నెలలో భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్‌కు వెళ్లి చర్చలు జరపనుంది. అమెరికాలో మారుతున్న టారిఫ్ విధానాలు, అంతర్జాతీయంగా సరఫరా గొలుసుల్లో వచ్చిన అంతరాయాల నేపథ్యంలో జరగబోయే ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏప్రిల్ 20న వాషింగ్టన్‌కు ఒక వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారత్ పంపనుంది. ఈ ప్రతినిధి బృందానికి ప్రధాన సంధాన కర్త దర్పణ్ జైన్ నేతృత్వం వహించనున్నారు (India US trade deal).
'ప్రధాన సంధానకర్త నేతృత్వంలోని భారత బృందం ఈ నెల 20వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనుంది. సుమారు 3-4 నెలల విరామం తర్వాత సంప్రదింపుల బృందాలు ప్రత్యక్షంగా సమావేశం కానున్నాయి. ఈ మధ్యకాలంలో వారు వర్చువల్‌గా సంప్రదింపులు జరుపుతూ వచ్చారు' అని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఫిబ్రవరి 7న విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనకు కొనసాగింపుగా, చట్టపరమైన ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా ఇది మరో అడుగని ఆయన పేర్కొన్నారు (India US talks 2026).
ఆ ప్రకటనను చట్టపరమైన ఒప్పందంగా ఖరారు చేయడానికి మరిన్ని చర్చలు, తదుపరి సంప్రదింపులు అవసరమని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు (Bilateral trade agreement India US). ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుంది. టెక్నాలజీ, ఎనర్జీ, వ్యవసాయ రంగాల్లో సహకారం పెరుగుతుంది. గ్లోబల్ సరఫరా గొలుసుల్లో భారత్‌కు బలం చేకూరుతుంది. అమెరికాతో ట్రేడ్ డీల్‌ను వేగవంతం చేయడానికి భారత్ చేస్తున్న ఈ తాజా ప్రయత్నం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
మాకు రూ.25 లక్షల కోట్లు చెల్లించండి.. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్..
ఇరాన్‌తో చర్చలు.. అమెరికా పెట్టిన రెండు షరతులు అవేనా..