భారీగా పెరుగుతోన్న బంగారం ధర
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:07 PM
దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే, ఈ ఉదయం బంగారం ధరల్లో భారీగా పెరుగుదల నమోదు కాగా, ఈ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతానికి మరింత పైపైకి ఎగబాకాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 21: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు బుధవారం(21-01-2026) ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారతదేశంలో రూ.1,54,800 ఉంటే, మధ్యాహ్నం గం. 3 ప్రాంతానికి 1,57,260కి చేరింది. ఇది.. నిన్న(మంగళవారం) రూ.1,49,780 ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ్టి మధ్యాహ్నానికి 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.7,480 పెరిగింది.
ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం(21-01-2026) ఉదయం రూ.1,41,900 గా ఉంటే, మధ్యాహ్నం గం.3 ప్రాంతానికి రూ.1,44,150 కు పెరిగింది. నిన్న(మంగళవారం) 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,300 ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఇవాళ మధ్యాహ్నానికి రూ. 6,850 పెరిగింది.
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ( 24కే, 22కే) ధరలు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విధంగా ఉన్నాయి..
హైదరాబాద్: ₹1,57,260; ₹1,44,150
ముంబై: ₹1,57,260; ₹1,44,150
చెన్నై: ₹1,57,260; ₹1,44,150
విజయవాడ: ₹1,57,260; ₹1,44,150
ఎందుకు ఇంత పెరుగుతోంది?
బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణ ఆందోళనలు వంటి అంతర్జాతీయ కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు దేశీయ మార్కెట్లో వివాహాల సీజన్, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా ధరలను మరింత పైకి నెట్టాయి.
గమనిక: బంగారం ధరలు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగానూ బంగారం ధరలు మారవచ్చు. తాజా రేట్ల కోసం స్థానిక బులియన్ డీలర్లు లేదా అధికారిక వెబ్‌సైట్లను చెక్ చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి
ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్