నేటి బంగారం ధరలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:55 AM
భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 25, 2026) స్థిరంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితి కారణంగా బంగారం ధరల్లో మందగమనం కనిపిస్తోంది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 25: భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 25, 2026) స్వల్ప పెరుగుదలను సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితి కారణంగా నిన్న బంగారం ధరల్లో మందగమనం కనిపించింది. MCXలో ఏప్రిల్ ఫ్యూచర్స్ నిన్న 0.31% తగ్గి, ప్రతి పది గ్రాములకు రూ.1,61,102 గా ఉంది.
ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికాలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ అయిన Comex(Commodity Exchange)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రతి ఔన్స్‌కు $ 22.50 పెరిగి $5,198.80గా ఉంది.
ఈ రోజు దేశంలో బంగారం ధరలు ప్రతి గ్రాముకు24 క్యారెట్లు (24K): సుమారు రూ. 16,178 నుంచి రూ. 16,244 మధ్య (నగరాలను బట్టి మారుతుంది)ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే, గ్రాముకు ఒక రూపాయి పెరిగి రూ. 16,179గా ఉంది.
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు గ్రాముకు 24 క్యారెట్లు, 22 క్యారెట్లు ధరలు వరుసగా ఇలా ఉన్నాయి:
హైదరాబాద్ రూ. 16,179 రూ. 14,831
విజయవాడ రూ. 16,179 రూ. 14,831
చెన్నై రూ. 16,245 రూ. 14,891
బెంగళూరు రూ. 16,179 రూ. 14,831
కేరళ రూ. 16,179 రూ. 14,831
పూణే రూ. 16,179 రూ. 14,831
ముంబై రూ. 16,179 రూ. 14,831
కోల్‌కతా రూ. 16,179 రూ. 14,831
ఢిల్లీ రూ. 16,194 రూ. 14,846
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్