షాకింగ్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:24 AM
మంగళ, బుధవారాల్లో పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పతనమయ్యాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.
మంగళ, బుధవారాల్లో పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పతనమయ్యాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గత రెండ్రోజులు పెరిగిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ లాభాల స్వీకరణ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో మళ్లీ ఈ రెండు లోహాల ధరలు నేల చూపులు చూస్తున్నాయి (Gold prices Live).
ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 5న) ఉదయం 10:00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,420కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 5,020 రూపాయలు తగ్గిపోయింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550కి చేరింది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 4,600 రూపాయలు పడిపోయింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,54,570కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,41,700కి చేరుకుంది.
ఇక, వెండి కూడా భారీగా పతనమైంది. మంగళ, బుధవారల్లో భారీగా పెరిగిన వెండి గురువారం షాక్ ఇచ్చింది. మళ్లీ రూ.3 లక్షలకు వచ్చేసింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.20 వేల మేర తగ్గిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..