బంగారం, వెండి ధరలు.. మరింత డౌన్.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:24 AM
అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువతో పాటు బంగారం, వెండి ధరలు కూడా మరింత కిందకు దిగివస్తున్నాయి. శనివారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువతో పాటు బంగారం, వెండి ధరలు కూడా మరింత కిందకు దిగివస్తున్నాయి. శనివారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడమే బంగారం, వెండి తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది (Gold prices).
ఈ రోజు (మార్చి 14న) ఉదయం 10:10 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1030 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.950 మేర తగ్గింది.
మరోవైపు వెండి ధరలు కూడా శనివారం తగ్గుదల నమోదు చేశాయి. వెండి కిలోకు రూ.4,900 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.8 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..