Share News

Garudavega-YourDesiCart: భారత్ నుంచి ప్రపంచానికి షాపింగ్ మరింత సులభం

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:19 PM

అంతర్జాతీయ ఈ-కామర్స్ రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునేందుకు Garudavega, YourDesiCart అనే క్రాస్-బోర్డర్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో YourDesiCart సేవలు Garudavega లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఏకీకృతమవుతాయి.

Garudavega-YourDesiCart: భారత్ నుంచి ప్రపంచానికి షాపింగ్ మరింత సులభం
Garudavega-YourDesiCart

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ ఈ-కామర్స్ రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునేందుకు Garudavega, YourDesiCart అనే క్రాస్-బోర్డర్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయం ద్వారా ఈ సంస్థ.. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం వంటి ముఖ్యమైన విదేశీ మార్కెట్లలో తన విస్తృతిని పెంచుకోనుంది.


2020లో స్థాపితమైన YourDesiCart (YourDesiCart.com) విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు.. భారత్ నుంచి సరకులు కొనుగోలు చేసి పంపించుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 90,000 మందికి పైగా వినియోగదారులతో పాటు 220కు పైగా దేశాలకు సేవలు అందిస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసి, లాకర్ అడ్రస్సుల ద్వారా సరకులను సమీకరించి విదేశాలకు పంపించుకోవచ్చు.

IndianClicks_Garudavega_YourDesiCart.jpg


ఈ స్వాధీనంతో YourDesiCart సేవలు Garudavega (Garudavega.com) లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఏకీకృతమవుతాయి. దీని వల్ల డెలివరీ సమయం తగ్గడం, సేవల నాణ్యత మెరుగుపడటం, ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.

NexGen Logistics సీఈఓ సతీశ్ లక్కరాజు మాట్లాడుతూ, 'ఈ ఒప్పందం ద్వారా మేము కస్టమర్లకు మరింత సమగ్ర ఈ-కామర్స్ అనుభవాన్ని దించగలుగుతాము' అన్నారు.

YourDesiCart వ్యవస్థాపకురాలు సత్య అయ్యగారి మాట్లాడుతూ, 'Garudavegaతో భాగస్వామ్యం ద్వారా మా సేవలను మరింత విస్తరించి, పంచవ్యాప్తంగా వినియోగదారులకు చేరుకోవచ్చు' అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న YourDesiCart త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనుంది. ఈ భాగస్వామ్యం భారతీయ విక్రేతలకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను సృష్టించనుంది.


ఇవీ చదవండి:

భారీ నష్టాల్లో సూచీలు.. ఇంట్రాడేలో ఏకంగా..

చాబహార్ పోర్టులో వాటాను విక్రయించే యోచనలో భారత్?

Updated Date - Apr 24 , 2026 | 03:19 PM