Share News

ఫ్లిప్‌కార్ట్‌ మరో కీలక నిర్ణయం.. మినిట్స్‌కు ప్రత్యేక యాప్‌..

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:48 PM

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు ప్రధాన ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్న క్విక్‌ కామర్స్‌ సేవ 'ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌'కు ప్రత్యేక యాప్‌ను తాజాగా పైలట్‌ ప్రాతిపదికన తీసుకొచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌ మరో కీలక నిర్ణయం.. మినిట్స్‌కు ప్రత్యేక యాప్‌..
Flipkart Minutes

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు ప్రధాన ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్న క్విక్‌ కామర్స్‌ సేవ 'ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌'కు ప్రత్యేక యాప్‌ను తాజాగా పైలట్‌ ప్రాతిపదికన తీసుకొచ్చింది. అదే సమయంలో 'ఈట్ ఇన్‌' పేరుతో ఫుడ్‌ డెలివరీ సేవను కూడా బెంగళూరులో ప్రారంభించనుంది (Flipkart Minutes App).


అక్టోబర్‌లో జరగనున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ (BBD) సేల్‌కు ముందు ఈ సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళ్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రస్తుతం ప్రధాన ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లోనే ఒక ప్రత్యేక విభాగంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనికి ప్రత్యేక యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఎర్లీ యాక్సెస్‌ ఇస్తూ యాప్‌ను పరీక్షిస్తున్నారు. వారి ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మార్పులు చేసి బీబీడీకి ముందు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది (Flipkart Quick Commerce).


ప్రత్యేక యాప్‌ ద్వారా క్విక్‌ కామర్స్‌ సేవకు మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం, వినియోగదారులు నేరుగా మినిట్స్‌ను ఉపయోగించేలా చేయడం కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది. మినిట్స్‌లో కేవలం కిరాణా సరుకులే కాకుండా ప్రస్తుతం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్‌, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, బియ్యం, పప్పులు, వంట నూనెలు, స్నాక్స్‌, పానీయాలు, ఇంటి అవసరాల వస్తువులు, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులు, బేబీ కేర్‌, పెట్‌ కేర్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిలో కొన్ని ఉత్పత్తులను నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..


మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 09 , 2026 | 09:48 PM