అక్టోబర్ నుంచి జీతంలో పీఎఫ్ కట్ ఎంత.. మారనున్న లెక్కలు..
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:08 PM
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో తప్పనిసరి పీఎఫ్ పరిధికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో తప్పనిసరి పీఎఫ్ పరిధికి సంబంధించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ మార్పు 2026 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త పరిమితి ప్రకారం లెక్కలు అమలుకానున్నాయి (EPFO wage ceiling 25000).
ఉద్యోగి పీఎఫ్ కోసం పరిగణించే వేతనం నెలకు రూ.20,000గా ఉంటే.. ఉద్యోగి వాటా 12 శాతం, అంటే రూ.2,400 అవుతుంది. గతంలో రూ.15,000 పరిమితి కారణంగా గరిష్ఠంగా రూ.1,800 మాత్రమే ఉద్యోగి వాటాగా కట్ అయ్యేది. ఇకపై రూ.20,000 పీఎఫ్ వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.600 పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఉద్యోగి చేతికి వచ్చే జీతం కూడా ఈ మేరకు తగ్గే అవకాశం ఉంటుంది (PF deduction October 2026).
కొత్త గరిష్ఠ పరిమితి రూ.25,000. ఈ మొత్తంపై 12 శాతం లెక్కిస్తే ఉద్యోగి పీఎఫ్ వాటా రూ.3,000 అవుతుంది. ఇంతకుముందు రూ.15,000 పరిమితి ప్రకారం రూ.1,800 కట్ అయ్యేది. అంటే పాత పరిమితితో పోలిస్తే నెలకు రూ.1,200 అదనంగా పీఎఫ్‌లో జమ అవుతుంది. ఉద్యోగి లాగానే యజమాని కూడా మరో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది (EPFO new rules 2026).
మొత్తంగా, రూ.15,000 నుంచి రూ.25,000కు పెరిగిన పీఎఫ్ వేతన పరిమితి వల్ల అర్హత కలిగిన ఉద్యోగులకు పీఎఫ్‌లో ఎక్కువ మొత్తం జమ కావచ్చు (PF salary deduction). అదే సమయంలో ప్రస్తుతం పాత పరిమితిపై పీఎఫ్ చెల్లిస్తున్న ఉద్యోగులకు నెలవారీ చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది. కొత్త పరిమితి వల్ల 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..