SBI Research: జూన్ నాటికి 50 డాలర్లకు క్రూడ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:52 AM
ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత తగ్గవచ్చని, జూన్ నాటికి పీపా 50 డాలర్లకు దిగిరావచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు అంచనా వేసింది. క్రూడ్ ధరల తగ్గుదల భారత...
ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత తగ్గవచ్చని, జూన్ నాటికి పీపా 50 డాలర్లకు దిగిరావచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు అంచనా వేసింది. క్రూడ్ ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా పరిణమించనుందని,వార్షిక జీడీపీ వృద్ధి రేటునుఅదనంగా 0.10-0.15 శాతం పెంచగలదని సోమవారం విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగి ఉన్న వెనెజువెలాపై గత వారాంతంలో అమెరికా దాడికి చేసినప్పటికీ, ముడిచమురు ధరలు అంతగా పెరగలేదని రిపోర్టు పేర్కొంది. గత వారం రోజులుగా బ్యారల్ రేటు 60 డాలర్ల స్థాయిలోనే కదలాడుతోంది. దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. అంతేకాదు, మొత్తం దిగుమతుల వ్యయంలో ఇంధన బిల్లుదే అధిక వాటా. గత డేటాను బట్టి చూస్తే క్రూడ్ ధర ప్రస్తుత స్థాయి నుంచి 14 శాతం మేరకు తగ్గితే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 శాతం మేర బలపడి రూ.87.5 స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. కాగా, చమురు నిల్వలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 55 డాలర్లకు దిగిరావచ్చని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి