Share News

చమురు గరం.. సెన్సెక్స్‌ పతనం

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:11 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య పరస్పర దాడులతో ముడి చమురు ధరలు మరింత ఎగబాకడంతో పాటు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలు చవిచూశాయి.

చమురు గరం.. సెన్సెక్స్‌ పతనం
NSE

సూచీ 382 పాయింట్లు డౌన్‌

ముంబై: అమెరికా-ఇరాన్‌ మధ్య పరస్పర దాడులతో ముడి చమురు ధరలు మరింత ఎగబాకడంతో పాటు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలు చవిచూశాయి. ఒక దశలో 545 పాయింట్ల మేర పతనమై 76,000 స్థాయిని కూడా కోల్పోయిన సెన్సెక్స్‌.. చివరికి 382.62 పాయింట్ల నష్టంతో 76,132.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118.55 పాయింట్లు కోల్పోయి 23,779.15 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలు వ రూ.1.69 లక్షల కోట్లు తగ్గి రూ.486.56 లక్షల కోట్ల కు (5.15 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి రూ.94.50 వద్ద ముగిసింది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రూ.9,500 కోట్ల సమీకరణ: ఒకేసారి లేదా విడతల వారీగా బాండ్ల జారీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.9,500 కోట్లు) నిధులు సమీకరించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ సోమవారం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..

Updated Date - Sep 08 , 2026 | 04:11 AM