Share News

Bondada Engineering: బొండాడ ఇంజనీరింగ్‌కు రూ.627 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:38 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో...

Bondada Engineering: బొండాడ ఇంజనీరింగ్‌కు రూ.627 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 400/220 కేవీ హిందూపూర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద 225 మెగావాట్లు/450 ఎండబ్ల్యూహెచ్‌ సామర్ధ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌) ఏర్పాటు చేయనుంది. ఎల్‌ఓఏ అందుకున్న ఏడాదిన్నరలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు విలువ రూ.627 కోట్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. బిల్ట్‌-ఓన్‌-ఆపరేట్‌ (బీవోవో) పద్దతిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:38 AM