ఆంథోపిక్ ఎఫెక్ట్.. ఐటీ షేర్లు క్రాష్
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:00 AM
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సేవల స్టార్టప్ ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్.. యూఎస్, యూర్‌పతో పాటు భారత ఐటీ కంపెనీల షేర్లనూ కుదిపేశాయి. బీఎ్‌సఈలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర...
ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ 7 శాతం డౌన్
బీఎ్‌సఈ ఐటీ ఇండెక్స్ 5.49 శాతం పతనం
రూ.1.66 లక్షల కోట్ల సంపద ఆవిరి
2020 మార్చి తర్వాత ఐటీకి అతిపెద్ద ఫాల్
ముంబై: అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సేవల స్టార్టప్ ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్.. యూఎస్, యూర్‌పతో పాటు భారత ఐటీ కంపెనీల షేర్లనూ కుదిపేశాయి. బీఎ్‌సఈలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర బుధవారం 7.19 శాతం క్షీణించి రూ.1,535.90కి పడిపోయింది. టీసీఎస్ షేరు కూడా 6.95 శాతం పతనమై రూ.3,000 దిగువకు పడిపోయింది. కోఫోర్జ్ 5.66 శాతం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 5.51 శాతం, హెక్సావేర్ టెక్నాలజీస్ 4.98 శాతం, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.69 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.22 శాతం, టెక్ మహీంద్రా 4.12 శాతం, విప్రో 3.73 శాతం నష్టపోయాయి. 2020 మార్చి తర్వాత ఐటీ రంగ షేర్లకు ఇదే అతిపెద్ద పతనం. దాంతో ఈ రంగ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.1.66 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. బీఎ్‌సఈలోని ఐటీ సూచీ 5.49 శాతం పతనమైంది. ఆంరఽథోపిక్ టూల్స్ దెబ్బకు అమెరికా మార్కెట్లోనూ మంగళవారం టెక్, సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఫైనాన్స్ సర్వీసుల కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. ఆ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే 28,500 కోట్ల డాలర్ల మేర పతనమైంది. అంతేకాదు, నాస్‌డాక్ సూచీ 1.43 శాతం క్షీణించింది.
సెన్సెక్స్ 78 పాయింట్లు అప్: రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇంట్రాడేలో 827 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్.. చివరికి 78.56 పాయింట్ల లాభంతో 83,817.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 48.45 పాయింట్ల వృద్ధితో 25,776 వద్ద క్లోజైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News