Uniper Global Commodities: యూనిపర్‌కు ఏఎం గ్రీన్ అమ్మోనియా
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:35 AM
మన దేశం పునరుత్పాదక ఇంధన వనరుల ఎగుమతికి సిద్ధమవుతోంది. ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా నుంచి ఏటా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మన దేశం పునరుత్పాదక ఇంధన వనరుల ఎగుమతికి సిద్ధమవుతోంది. ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా నుంచి ఏటా ఐదు లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా దిగుమతి చేసుకునేందుకు ‘యూనిపర్ గ్లోబల్ కమోడిటీస్ ఎస్‌ఈ’ అనే సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి సోమవారం ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ సమక్షంలో రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కాకినాడ వద్ద ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నుంచి 2028 ప్రారంభంలో తొలి ఎగుమతి ప్రారంభమవుతుందని ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి