Share News

అత్యవసర, తక్షణ వైద్య సరఫరాల కోసం నిలువుగా ఎగిరే ఈ-విమానాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:12 AM

దేశంలో అత్యవసర, తక్షణ వైద్య సరఫరాల కోసం రన్‌వే అవసరం లేకుండా నిలువుగా ఎగిరే, దిగే ఎలక్ట్రిక్‌ విమానాల (ఈవీటీఓఎల్‌)ను వినియోగించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి...

అత్యవసర, తక్షణ వైద్య సరఫరాల కోసం నిలువుగా ఎగిరే ఈ-విమానాలు

సాధ్యాసాధ్యాల అధ్యయనానికి స్కైడ్రైవ్‌, సుజుకీతో ఎయిరిండియా ఒప్పందం

ముంబై: దేశంలో అత్యవసర, తక్షణ వైద్య సరఫరాల కోసం రన్‌వే అవసరం లేకుండా నిలువుగా ఎగిరే, దిగే ఎలక్ట్రిక్‌ విమానాల (ఈవీటీఓఎల్‌)ను వినియోగించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు సాధ్యాసాధ్యాలపై ఉమ్మడిగా అధ్యయనం చేసేందుకు జపాన్‌కు చెందిన ఈవీటీఓఎల్‌ల అభివృద్ధి, తయారీ సంస్థ స్కైడ్రైవ్‌తో పాటు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌తో ఎయిరిండియా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా స్కైడ్రైవ్‌ ఈవీటీఓఎల్‌ సాంకేతికతను, ఎయిరిండియా విమానాల నిర్వహణ నైపుణ్యాన్ని, సుజుకీ మార్కెట్‌ అనుభవాన్ని ఉపయోగించుకొని ఎమర్జెన్సీ మెడికల్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు చిన్న నగరాల రోడ్లు కూడా అత్యంత రద్దీగా మారుతున్న నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని వైద్యం కోసం దూర ప్రాంతాలకు తరలించడం లేదా కీలక ఔషధాల చేరవేత అత్యంత సవాలుగా మారింది. ఈవీటీఓఎల్‌ల వినియోగం ఈ సవాలును అధిగమించేందుకు దోహదపడనుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:12 AM