Share News

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..

ABN , Publish Date - May 10 , 2026 | 09:48 PM

గత మూడు సంవత్సరాల్లో ఎయిరిండియా 1,000 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. నైతిక ఉల్లంఘనలు, ఉద్యోగ ప్రయోజనాల దుర్వినియోగం, అక్రమ చర్యల్లో పాల్గొన్నారనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఉద్యోగుల అవినీతి.. మూడేళ్లలో వెయ్యి మందిని తొలగించిన ఎయిరిండియా..
Air India employees fired

గత మూడు సంవత్సరాల్లో ఎయిరిండియా 1,000 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. నైతిక ఉల్లంఘనలు, ఉద్యోగ ప్రయోజనాల దుర్వినియోగం, అక్రమ చర్యల్లో పాల్గొన్నారనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల ముంబైలో జరిగిన టౌన్‌హాల్ మీటింగ్‌లో సీఈవో క్యాంప్‌బెల్ ఈ విషయాన్ని వెల్లడించారు (Air India employees fired).


కొందరు ఉద్యోగులు అదనపు లగేజీకి చార్జీలు లేకుండా అనుమతించడం, విమానాల నుంచి వస్తువులను అక్రమంగా తరలించడం వంటి చర్యలకు పాల్పడ్డారని క్యాంప్‌బెల్ పేర్కొన్నారు. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీని కూడా వందలాది మంది ఉద్యోగులు దుర్వినియోగం చేశారని తెలిపారు. ఎవరూ చూడకపోయినా సరైన విధంగా వ్యవహరించడం ఉద్యోగుల బాధ్యతన్నారు. సంస్థలో ప్రతి సంవత్సరం వందలాది మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు (Air India ethical breaches).


పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడకపోతే ఈ ఏడాది కూడా కఠిన పరిస్థితులు తప్పవని అన్నారు (Tata Group Air India). టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియాలో ప్రస్తుతం సుమారు 24,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, పెరుగుతున్న ఖర్చులు, అంతర్జాతీయ విమానయాన రంగంలోని సవాళ్ల మధ్య సంస్థ ఖర్చు నియంత్రణ చర్యలను కఠినతరం చేసినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..


విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..

Updated Date - May 10 , 2026 | 09:48 PM