Share News

NASSCOM Says10 Million Jobs: పదేళ్లలో 10 కోట్ల కొత్త కొలువుల కల్పన

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:59 AM

దేశంలో ఉద్యోగాల కల్పన కోసం పారిశ్రామిక దిగ్గజాలు కూడా చొరవ తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘100 మిలియన్‌ జాబ్స్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రకటించారు. వచ్చే పదేళ్లలో...

NASSCOM Says10 Million Jobs: పదేళ్లలో 10 కోట్ల కొత్త కొలువుల కల్పన

100 మిలియన్‌ జాబ్స్‌ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌

నాస్కామ్‌ సహ వ్యవస్థాపకులు హరీష్‌ మెహతా

నూఢిల్లీ: దేశంలో ఉద్యోగాల కల్పన కోసం పారిశ్రామిక దిగ్గజాలు కూడా చొరవ తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘100 మిలియన్‌ జాబ్స్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రకటించారు. వచ్చే పదేళ్లలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నాస్కామ్‌ సహ వ్యవస్థాపకులు హరీష్‌ మెహతా, ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) వ్యవస్థాపకులు ఏజే పటేల్‌, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ (సీఐపీపీ) వ్యవస్థాపకులు కే యతీష్‌ రజావత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రస్తుత పరిస్థితి: ఆర్థిక వృద్ధి జోరుగా ఉన్నా ప్రస్తుతం దేశంలో ఉద్యోగాల కల్పన పెద్దగా లేదు. ఏటా 1.2 కోట్ల మంది జాబ్‌ మార్కెట్లోకి వస్తుంటే వీరిలో సగం మందికి కూడా సరైన కొలువులు దొరకడం లేదు. ఏటా కనీసం 80 నుంచి 90 లక్షల మందికైనా ఉద్యోగాలు లభిస్తే తప్ప నిరుద్యోగ సమస్య తీరదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు అభ్యర్ధుల్లో లేకపోవడం కూడా నిరుద్యోగానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక పెద్దలే ఉద్యోగాల కల్పన కార్యక్రమానికి చొరవ తీసుకోవడం విశేషం.

కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు..

  • ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ

  • ఉద్యోగ కల్పన కేంద్రంగా ఆర్థిక అభివృద్ధి

  • ప్రాంతాలు, రంగాల వారీగా ఉద్యోగ అవకాశాల పరిశ్రమల గుర్తింపు

  • ఎక్కువ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న చిన్న పరిశ్రమలు, స్టార్ట్‌ప్సపై ప్రత్యేక దృష్టి

  • ప్రధాన నగరాలకు వెలుపల చిన్న పరిశ్రమల విస్తరణ

  • ఉద్యోగాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సంస్థాగత అడ్డంకుల తొలగింపు

  • ప్రభుత్వ, వ్యాపార ఆలోచనా విధానాల్లో మార్పు

  • ప్రభుత్వం-పరిశ్రమలు, సమాజం మధ్య సమన్వయం

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:59 AM