వారంలో.. ఈ రోజుల్లో బట్టలు ఉతక్కపోవడం మంచిది..
ABN , Publish Date - Jan 31 , 2026 | 02:08 PM
బట్టలు ఉతికే పనులను వారంలో కొన్ని రోజులు మాత్రమే చేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎలా పడితే అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి ఆర్థిక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఇంట్లో చేసే రోజువారీ పనులకు కూడా కొన్ని నియమాలు ఉంటాయట. మనకు సాధారణంగా అనిపించే బట్టలు ఉతకడం వంటి పనిని కూడా కొన్ని రోజుల్లో చేయకపోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయకపోతే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి ఆర్థిక, మానసిక సమస్యలు తలెత్తవచ్చని చెబుతున్నారు.
గురువారం..
గురువారం విష్ణువుకు, బృహస్పతి గ్రహానికి సంబంధించిన రోజు. బృహస్పతి సంపద, జ్ఞానం, పిల్లలు, శుభం వంటి విషయాలకు సంకేతం. ఈ రోజున బట్టలు ఉతకడం, సబ్బులు లేదా రసాయనాలు ఉపయోగించడం వల్ల బృహస్పతి బలహీనపడతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని వల్ల డబ్బు సమస్యలు, అభివృద్ధిలో ఆటంకాలు రావొచ్చని నమ్ముతారు.
మంగళవారం..
మంగళవారం రోజున బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో అనవసర గొడవలు, అశాంతి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొందరి నమ్మకం ప్రకారం.. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
శనివారం..
శనివారం శనిదేవుని రోజు. ఈ రోజున నూనెకు సంబంధించిన పనులు, పాత వస్తువుల శుభ్రపరిచే పనులను తగ్గించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శనివారం బట్టలు ఉతకడం లేదా నీటిని వృథా చేయడం వల్ల శని దోషం పెరుగుతుందని కొందరు నమ్ముతారు. అలాగే జీవితంలో అడ్డంకులు రావొచ్చని భావిస్తారు.
రాత్రిపూట బట్టలు ఆరబెట్టడం మానుకోండి..
వాస్తు, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా ఆరబెట్టడం మంచిది కాదు. రాత్రి సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని, అది బట్టల ద్వారా మన శరీరంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అలాగే శాస్త్రీయంగా చూస్తే, సూర్యకాంతి లేకపోవడం వల్ల బట్టలపై క్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం కావొచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News