చేతి వేళ్లు ఇలా ఉంటే.. డబ్బు బాగా నిలుస్తుందట!
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:03 PM
హస్తసాముద్రికం ప్రకారం.. చేతి గీతలతో పాటు వేళ్ల ఆకారం, కణుపులు, వాటి మధ్య ఉండే ఖాళీలను బట్టి సంపదకు సంబంధించిన కొన్ని సంకేతాలను అంచనా వేయవచ్చని నమ్ముతారు.
ఇంటర్నెట్ డెస్క్: హస్తసాముద్రికం ప్రకారం.. చేతిలోని గీతలు, వేళ్ల ఆకారం, కణుపులను బట్టి ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి అంచనా వేయవచ్చని నమ్ముతారు. వేళ్ల ఆకారం, వాటి మధ్య ఉండే ఖాళీలు సంపదకు సంబంధించిన కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు.
వేళ్ల మధ్య ఖాళీ ఉంటే ఏం జరుగుతుంది?
మీ చేతులను నిటారుగా చాచి సాధారణ స్థితిలో ఉంచి వేళ్లను గమనించండి. వేళ్ల మధ్య ఎక్కువగా ఖాళీలు కనిపిస్తే.. చేతిలోకి డబ్బు వచ్చినా ఎక్కువ కాలం నిలవదని హస్తసాముద్రికంలో చెబుతారు. వచ్చిన డబ్బును త్వరగా ఖర్చు చేసే అవకాశం ఉంటుందని నమ్మకం. అన్ని వేళ్ల మధ్య ఖాళీలు ఉంటే పొదుపు చేయడం కష్టమవుతుందని అంటారు. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చవుతుందని చెబుతారు.
వేళ్లు దగ్గరగా ఉంటే..
వేళ్లన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండి, వాటి మధ్య పెద్దగా ఖాళీలు లేకపోతే సంపదను కూడబెట్టే లక్షణం ఉన్నట్లు హస్తసాముద్రికం చెబుతుంది. ఇలాంటి వారు డబ్బును జాగ్రత్తగా నిర్వహించి పొదుపు చేయగలరని నమ్ముతారు. వేళ్లు సన్నగా ఉండి, వాటి చివరలు కొద్దిగా పదునుగా ఉంటే కూడా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందని హస్తసాముద్రికంలో పేర్కొంటారు.
మధ్య కణుపులు పొడవుగా ఉంటే?
ప్రతి వేలులో సాధారణంగా మూడు కణుపులు ఉంటాయి. మొదటి, మూడో కణుపులతో పోలిస్తే మధ్య కణుపు పొడవుగా లేదా పెద్దగా ఉంటే.. అలాంటి వారు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందని హస్తసాముద్రిక నమ్మకం. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తారని చెబుతారు.
ఇలాంటి చేతులు ఉంటే పెట్టుబడులకు దూరంగా ఉండాలా?
వేళ్లు సాధారణం కంటే పొట్టిగా, లావుగా ఉండి.. మణికట్టు నుంచి వేళ్ల వరకు ఉన్న అరచేతి భాగం ఎక్కువగా కనిపిస్తే జూదం, అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండాలని హస్తసాముద్రికంలో చెబుతారు. తొందరపడి పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉందని నమ్మకం. అలాగే ఇతరులను పూర్తిగా నమ్మి డబ్బును పెట్టుబడిగా పెట్టకుండా, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తారు.
Note: ఇందులోని సమాచారం హస్తసాముద్రికం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
వినాయక ఉత్సవాల తర్వాత నిమజ్జనం ఎందుకు?.. అసలు కథ ఇదే..
గణేశుడికి లడ్డూలకు బదులు బోబా టీ.. థాయ్‌లాండ్‌లో వింత ఆచారం!