Share News

కృష్ణాష్టమి 2026.. ఈ 4 రాశుల వారికి అనూహ్య అదృష్టం.!

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:55 PM

కృష్ణాష్టమి 2026 సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక విషయాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి అంశాల్లో వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వస్తున్నారు.

కృష్ణాష్టమి 2026.. ఈ 4 రాశుల వారికి అనూహ్య అదృష్టం.!
Krishna Ashtami 2026 Lucky Zodiac Signs

ఇంటర్నెట్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 4, శుక్రవారం జన్మాష్టమిని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కొన్ని గ్రహాల ప్రత్యేక కలయిక ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశులపై ఉన్నప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


తులారాశి:

కృష్ణాష్టమి సందర్భంగా తులారాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం ఉండొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో ఆర్థికంగా మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, మంచి గుర్తింపు కూడా లభించవచ్చు.

సింహరాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది జన్మాష్టమి సింహరాశి వారికి శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ సమయంలో సూర్యుడు సింహరాశిలో ఉండటం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.


వృషభ రాశి:

కృష్ణాష్టమి రోజున వృషభ రాశి వారికి చంద్రుడు చాలా బలమైన, అనుకూలమైన స్థానంలో ఉంటాడు. దీని కారణంగా, ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి:

శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు కర్కాటక రాశి వారికి గరిష్ట ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో గురు, చంద్ర గ్రహాలు ఉన్నత స్థానాల్లో ఉండటం వల్ల, ఈ రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపదను పొందుతారు. సమాజంలో హోదా పెరిగి, ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

ఉరిశిక్ష పడిన వ్యక్తికీ చివరిసారిగా చెప్పుకునే అవకాశం ఇస్తారు: కొండా సురేఖ..

Updated Date - Sep 03 , 2026 | 04:55 PM