Share News

బయటకు వెళ్లేటప్పుడు చెడు శకునాలు ఎదురైతే ఏం చేయాలి?

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:00 AM

బయటకు వెళ్లేటప్పుడు చెడు శకునాలు ఎదురైతే ఏం చేయాలి? జ్యోతిషశాస్త్ర నిపుణులు ఈ విషయంపై ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలుసుకుందాం..

బయటకు వెళ్లేటప్పుడు చెడు శకునాలు ఎదురైతే ఏం చేయాలి?
Astrology Tips For Safe Travel

ఇంటర్నెట్ డెస్క్: బయటకు వెళ్లేటప్పుడు చెడు శకునాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. కాలు తడబడటం, తలనొప్పి, తుమ్ములు వంటి చిన్న సమస్యలు అశుభం కాదు, జాగ్రత్తగా ఉండడానికి సంకేతాలు మాత్రమే.. అటువంటి పరిస్థితులలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ఏదైనా వాహనంలో లేదా నడిచేటప్పుడు ప్రయాణించేటప్పుడు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు చెడు శకునాలు (నల్ల పిల్లి అడ్డరావడం, ఎవరైనా పిలవడం, విరిగిన వస్తువులు) ఎదురైతే వాటిని చెడు సంకేతాలని భావిస్తాం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీటికి అనుసరించగల సరళమైన పరిష్కారాలు ఉన్నాయని అంటున్నారు.


చెడు శకునాలు ఎదురైనప్పుడు చేయవలసినవి:

  • వెంటనే వెళ్లకుండా ఒక 5-10 నిమిషాలు ఆగి, కూర్చుని, ఆపై బయలుదేరడం మంచిది.

  • బయలుదేరే ముందు కొద్దిగా నీరు తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

  • మీకు నచ్చిన దైవ నామాన్ని స్మరించుకుని వెళ్లండి.

  • తాళం కింద పడిపోతే.. పెట్రోల్ ఉందా లేదా వాహనం పంక్చర్ అయిందో లేదో తనిఖీ చేయడానికి ఇది హెచ్చరిక కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ముందుగా కుడి పాదాన్ని బయట పెట్టడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 09 , 2026 | 11:39 AM