Share News

ఢిల్లీలో జికా, డెంగ్యూ ఒకేసారి వ్యాప్తి

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:07 AM

దేశ రాజధాని ఢిల్లీలో జికా, డెంగ్యూ వైర్‌సలు ఒకేసారి ఒకే ప్రాంతంలో వ్యాప్తి చెందుతున్నాయని ఐసర్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో స్పష్టమైంది. ఈ కీలక అధ్యయనం ప్రతిష్ఠాత్మక ‘ది లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌-సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ ...

ఢిల్లీలో జికా, డెంగ్యూ ఒకేసారి వ్యాప్తి

  • తిరుపతి ఐసర్‌ పరిశోధనలో వెల్లడి

ఏర్పేడు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో జికా, డెంగ్యూ వైర్‌సలు ఒకేసారి ఒకే ప్రాంతంలో వ్యాప్తి చెందుతున్నాయని ఐసర్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో స్పష్టమైంది. ఈ కీలక అధ్యయనం ప్రతిష్ఠాత్మక ‘ది లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌-సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ జర్నల్‌లో ప్రచురితమైంది. తిరుపతి సమీపంలోని ఏర్పేడు వద్ద వున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్చ్‌(ఐసర్‌) బయాలజీ విభాగం, ఫండమెంటల్‌ అండ్‌ అప్లైడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్‌ గురుప్రసాద్‌, ఆర్‌.మెడిగేశి నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది.

కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ అధ్యయనానికి ఆర్థిక సహకారం అందించింది. ఢిల్లీ శివారులోని కమ్యూనిటీలో దీర్ఘకాలికంగా నిర్వహించిన సెరో-సర్వేలెన్సులో శాస్త్రవేత్తలు కీలక ఆధారాలను గుర్తించారు. ప్రతి వంద మందిలో ఏడుగురు ఏదో ఒక దశలో జికా బారిన పడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 01:13 AM