Share News

ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:39 AM

ఏలూరు జిల్లాలో ఒక్క ఓటుతో వైసీపీ గెలిచింది. టి.నరసాపురం మండలం బండివారిగూడెం ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తాళ్ల రాంబాబు ఒక్క ఓటుతో విజయం సాధించారు.

ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు

టి.నరసాపురం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో ఒక్క ఓటుతో వైసీపీ గెలిచింది. టి.నరసాపురం మండలం బండివారిగూడెం ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తాళ్ల రాంబాబు ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొత్తం 2233 ఓట్లు పోల్‌ కాగా తాళ్ల రాంబాబుకు 1052, జనసేన అభ్యర్థి తోట సాయికుమార్‌కు 38, టీడీపీ అభ్యర్థి ములకాల వసంతరావుకు 1051 ఓట్లు వచ్చాయి. కూటమి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి బరిలో లేకుండా ఉండి ఉంటే టీడీపీ అభ్యర్థి విజయం సాధించి ఉండేవారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:39 AM