Share News

విజయనగరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:02 PM

విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలో చేరారు.

విజయనగరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు
Vizianagaram Politics

విజయనగరం, జూన్ 24: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వ ప్రజాకర్షక విధానాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో ఈ భారీ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ నుంచి గజపతినగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు వాలంటీర్లు, ముఖ్య నాయకులు తమ అనుచరులతో కలిసి తరలివచ్చారు. మొత్తం 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన నేతలకు, కార్యకర్తలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఘనస్వాగతం పలికారు.


ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయి. పార్టీ నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తాం. గజపతినగరం నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 04:13 PM