Share News

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:08 AM

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం జిల్లాకోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి అప్పిరెడ్డికి 19 వరకు రిమాండ్‌ విధించారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు

  • 19 వరకు రిమాండ్‌

గుంటూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం జిల్లాకోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి అప్పిరెడ్డికి 19 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం ఆయనను పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీ నేతలు బ్యాలెట్‌ బాక్సులు మర్చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తర్వాత నల్లపాడుకు తరలించారు. శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు... తర్వాత జిల్లా కోర్టులో హాజరు పరిచారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:09 AM