వైసీపీ నేతలపై కేసులు
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:19 AM
డీఎస్సీ టీచర్లపై దాడి ఘటనలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. హత్యాయత్నం అభియోగాలతో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రెండు, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి నమోదయ్యాయి.
రౌడీషీటర్ల వేటకు ప్రత్యేక బృందాలు
డీఎస్సీ టీచర్లపై దాడి ఘటనలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. హత్యాయత్నం అభియోగాలతో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రెండు, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో శాప్ డైరెక్టర్ సంతోశ్ ఫిర్యాదుపై పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన విభాగం నాయకుడు నాగార్జున యాదవ్‌తో పాటు దేవినేని అవినాశ్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, గౌతం రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎంజీ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు నిషేధాజ్ఞలను ఉల్లఘించి రహదారులపై నానా విధ్వంసం సృష్టించిన ఫిర్యాదులపై సూర్యారావు పేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, టీచర్లపై దాడిలో పాల్గొన్న రౌడీషీటర్ల వేటకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడతోపాటు మచిలీపట్నం, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు ఈ దాడుల్లో పాలుపంచుకుంటున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌ల ఆధారంగా వారిని గుర్తిస్తున్నారు. రౌడీషీటర్లను సమీకరించి, టీచర్లపైకి ఉసిగొలిపిన నేతలను కూడా అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక