కేసుల వివరాలు అందజేసేలా ఆదేశించండి
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:08 AM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను కోరితే వాటిని అందించేలా పోలీసులు..
హైకోర్టులో వైసీపీ పిటిషన్
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను కోరితే వాటిని అందించేలా పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పందిస్తూ పిటిషన్ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని అభ్యర్ధించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత వ్యాజ్యం పై శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు