షర్మిల ఇంట శుభకార్యం
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:37 AM
తన కుమార్తె అంజలిరెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈనెల 24న వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురావ్ రెడ్డిల నిశ్చితార్థం జరుగుతుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
24న కుమార్తె నిశ్చితార్థం
నవంబరు 25న వివాహ వేడుక
అమరావతి, వేంపల్లె, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె అంజలిరెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈనెల 24న వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురావ్ రెడ్డిల నిశ్చితార్థం జరుగుతుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. నవంబరు 25న వివాహం, డిసెంబరు 5న రిసెప్షన్ ఉంటుందని ఆమె తెలిపారు. తొలి పెళ్లి కార్డును వైఎస్ ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. ఆమేరకు ఫొటోలను తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
జగన్‌ను ఆహ్వానిస్తారా..?
మేనకోడలు అంజలి నిశ్చితార్థం, వివాహానికి రావాలంటూ అన్న జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా? లేదా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. పులివెందులలో తండ్రి సమాధిని దర్శించుకొని నేరుగా బెంగళూరు వెళ్లిన షర్మిల జగన్ ఉంటున్న యలహంక ప్యాలెస్‌కు వెళ్లలేదు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంట జరిగిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనుమరాలు అంజలి వివాహ నిశ్చితార్థాల సమాచారాన్ని తల్లి విజయమ్మ జగన్‌కు చేరవేశారు. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నిశ్చితార్థానికి హాజరైన ఆయన మేనల్లుడి వివాహ వేడుకకు మాత్రం వెళ్లలేదు. అస్తుల పంపకాల్లో వచ్చిన గొడవలు, కాంగ్రె్‌సలో షర్మిల చేరికతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. అయితే జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల ఆహ్వాన పత్రికను అందిస్తారని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలనూ చదవండి...