Share News

యువజనోత్సవాలను విజయవంతం చేయండి

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:09 PM

జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత పాల్గొని విజయ వంతం చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి పిలుపునిచ్చారు.

యువజనోత్సవాలను విజయవంతం చేయండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సిరి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు స్పోర్ట్స్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో యువత పాల్గొని విజయ వంతం చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు.ఆమె మాట్లాడుతూ యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు యువజనోత్సవాలు చక్కటి వేదికగా నిలుస్తాయ న్నారు. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. సెట్కూరు సీఈవో డా.కే.వేణుగోపాల్‌ మాట్లాడుతూ అక్టోబరు 1న అశోకా మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. పాల్గొనదలచిన యువత, తమ బృందాల పేర్లను వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 8328181581ను సంప్రదించాలన్నారు. జిల్లా ఉపాధి అధికారి దీప్తి, ఆర్‌ఐవో లాలెప్ప, డీఎ్‌సడీవో భూపతిరావు, సెట్కూరు సిబ్బంది శ్యామల, నితీ్‌షకుమార్‌, శంకర్‌బాయి పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 11:09 PM