Share News

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..

ABN , Publish Date - Apr 04 , 2026 | 10:01 PM

జాతీయ మీడియా సంస్థలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..
YS Jagan Mohan Reddy

అమరావతి, ఏప్రిల్4: జాతీయ మీడియా సంస్థలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీడియా సంస్థలన్నీ అవినీతిమయమయ్యాయని జగన్ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ జన్నలిస్ట్స్ యూనియన్(IJU)తో పాటు పలు రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జగన్ వ్యాఖ్యలపై ఐ.జె.యు. సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే (APUWJ) అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి శివ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.


జాతీయ స్థాయి మీడియా సంస్థలు కరప్ట్ అయిపోయిందని జగన్ అనడం దిగ్భ్రాంతి కలిగించిందని వారు పేర్కొన్నారు. మీడియాపై జగన్ మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉన్న చులకన భావం ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి బహిర్గతమైందని జర్నలిస్ట్ నేతలు ధ్వజమెత్తారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, స్వయంగా ఒక మీడియా సంస్థకు అధినేతగా ఉండి.. ఇతర మీడియా సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదు అని వారు హితవుపలికారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి, ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలతో కించపరచడం ఆమోదయోగ్యం కాదని జర్నలిస్ట్ సంఘాలు స్పష్టం చేశాయి. మాటల ధోరణిని మార్చుకోవాలని ఈ సందర్భంగా వారు జగన్‌కు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 04 , 2026 | 10:05 PM