యూట్యూబర్ రమానందనకు అద్దంకి పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:48 AM
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసం చేసిన కేసులో యూట్యూబర్ రమానందనకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న ఆమెకు..
17న విచారణకు రావాలని ఆదేశం .. ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో విచారణ
ఇబ్రహీంపట్నం/విజయవాడ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసం చేసిన కేసులో యూట్యూబర్ రమానందనకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణ ఎదుర్కొంటున్న ఆమెకు.. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రమానందన ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఇటీవల బాధితుడు క్రాంతికుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె ఈ నెల 8న విచారణకు హాజరయ్యారు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. రమానందనపై అద్దంకిలోనూ మరో బాధితుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలో రెండో దఫా విచారణకు హాజరైన మరోసటి రోజునే అద్దంకిలో పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి