Share News

వీధి కుక్కలు తరమడంతో బైకుపై నుంచి పడి మహిళ మృతి

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:24 AM

కుక్కలు తరుముకురావడంతో బైకుపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

వీధి కుక్కలు తరమడంతో బైకుపై నుంచి పడి మహిళ మృతి

చిట్వేలి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కుక్కలు తరుముకురావడంతో బైకుపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ రెడ్డి కథనం మేరకు... గుడ్లవారిపల్లెకు చెందిన చాపల ప్రమీలమ్మ అలియాస్‌ అరుణమ్మ(60) చిన్నకొడుకు రమేశ్‌తో కలిసి తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో మోటారుసైకిల్‌పై వెళుతుండగా రామాలయం వద్దకు వచ్చేసరికి కుక్కల గుంపు తరుముకుంటూ బైకుకు అడ్డం వచ్చింది. బైకు అదుపుతప్పి వెనుక కూర్చొని ఉన్న ప్రమీలమ్మ కిందపడిపోయింది. ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో, 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలి పెద్ద కుమారుడు నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 06:24 AM