Share News

భర్త బతికుండగానే వితంతు పింఛన్‌కు దరఖాస్తు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:51 AM

వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఓ మహిళ తన భర్త బతికి ఉండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన వైనం వెలుగు చూసింది.

భర్త బతికుండగానే వితంతు పింఛన్‌కు దరఖాస్తు!

  • డెత్‌ సర్టిఫికెట్‌ కోసం సిబ్బందికి రూ.20 వేలు లంచం

గోనెగండ్ల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఓ మహిళ తన భర్త బతికి ఉండగానే చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించిన వైనం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రానికి చెందిన మహిళ సచివాలయ సిబ్బందికి రూ.20 వేలు ఇచ్చి 2016 జూన్‌ 16న తన భర్త చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై కొందరు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గోనెగండ్లలో ఉన్న నాలుగు సచివాలయాల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్‌ దరఖాస్తుకు సరైన పత్రాలు లేవని ప్రజలను భయపెట్టి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పింఛన్‌ మంజూరు చేయిస్తామని కూటమిలోని ఓ పార్టీ నాయకులు కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. పింఛన్‌ కోసం దరఖాస్తు చేయడంలో సచివాలయ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి రావడంతో వారిని మందలించానని ఎంపీడీవో మణిమంజరి చెప్పారు. వితంతు పింఛన్‌ కోసం బతికి ఉన్న భర్తకు మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన విషయం ఆలస్యంగా తెలిసిందని, ఆ మహిళ దరఖాస్తును తొలగిస్తామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:51 AM