Share News

మహిళ శరీరం ముక్కలు.. ముక్కలుగా..

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:23 AM

పదునైన ఆయుధంతో ఓ మహిళ శరీరాన్ని ముక్కలుగా నరికారు.. మెడ వరకు తలను, మొల వరకు కాళ్లను, భుజాల వరకు రెండు చేతులను తొలగించారు.. అనంతరం ఆ భాగాలను ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం కూలింగ్‌ కెనాల్‌లో పడేశారు.

మహిళ శరీరం ముక్కలు.. ముక్కలుగా..

  • మొండెం.. తల, కాళ్లు, చేతులు లభ్యం

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పదునైన ఆయుధంతో ఓ మహిళ శరీరాన్ని ముక్కలుగా నరికారు.. మెడ వరకు తలను, మొల వరకు కాళ్లను, భుజాల వరకు రెండు చేతులను తొలగించారు.. అనంతరం ఆ భాగాలను ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం కూలింగ్‌ కెనాల్‌లో పడేశారు. వాటిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. హ తురాలి వయసు సుమారు 30-40 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. దుస్తులపై ఉన్న ఆనవాళ్లను మీడియాకు వివరించారు. మిగతాశరీర భాగాల కోసం శనివారం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సాయంతో కూలింగ్‌ కెనాల్‌లో గాలించగా, తల, రెండు కాళ్లు, కుడి చెయ్యి లభ్యమయ్యాయి. వాటిని వెస్ట్‌ ఏసీపీ దుర్గారావు, సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, క్లూస్‌టీమ్స్‌ పరిశీలించాయి. సీఐ మాట్లాడుతూ మహిళ ఎవరనేది నిర్ధారణ కాలేదన్నారు. ముఖాన్ని పరిశీలిస్తే హత్యకు గురైన మహిళది ఈ ప్రాంతం కాకపోవచ్చన్నారు. ఎక్కడో హత్య చేసి కూలింగ్‌ కెనాల్‌ ప్రవహించే తుమ్మలపాలెం, గొల్లపూడి, సూరాయిపాలెం, గుంటుపల్లి వంతెనల వద్ద నీటిలో పడేసి ఉండవచ్చని పేర్కొన్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 04:23 AM