Share News

యువతను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:48 AM

యువ తను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనం దరిపై ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి అన్నారు.

యువతను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి
మొక్క నాటుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి,

యువతను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి

ఏలూరు క్రైం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): యువ తను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనం దరిపై ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి అన్నారు. ఏలూరు జిల్లా కలెక్ట రేట్‌ గోదావరి సమావేశ మందిరంలో శనివారం పేద రిక నిర్మూలనకై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, నియం త్రణ, ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకత్వం, న్యాయ పర మైన అంశాలు, తదితర అంశాలపై వివరించారు. అవ గాహన సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయ మూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు, ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రాణ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ వై ప్రసాద రావులు పాల్గొన్నారు. డీఆర్డీఏ, మిషన్‌ శక్తి పథకం (వన్‌స్టాఫ్‌ సెంటర్‌), ఈగల్‌ హెల్ప్‌లైను 1972, న్యాయ విజ్ఞాన సదస్సు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), గిరిజన సంక్షేమం, దివ్యాంగులు సంక్షే మం, తదితర 12 స్టాల్స్‌ను ప్రారంభించారు. డీఆర్డీఏ ద్వారా రూ.889.93 కోట్లను 10,086 సంఘాలకు 61,120 సభ్యులకు నమూనా చెక్కును అందజేశారు.జిల్లా దివ్యాంగులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టచ్‌ ఫోన్లు, వినికిడి యంత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె అభిషేక్‌ గౌడ్‌ వివిధ శాఖలు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథ కాలను అర్హులకు అందించడంలో ఏలూరు జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలన్నారు. పేదరిక నిర్మూలన, మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే అనర్థాలు – వాటి నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, సంబంధిత న్యాయ పరమైన అంశాలపై విస్తృత అవ గాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి..

పరిసరాల శుభ్రతతో పాటు సమాజ సేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. ఏలూరు జిల్లా కలెక్ట రేట్‌ గోదావరి సమావేశ మందిర ప్రాంగణంలో శని వారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. శ్రీదేవి, ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.జె.అభిషేక్‌ గౌడ్‌ సంయుక్తంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆరోగ్య కర జీవన విధానానికి ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. రోజువారీ అవసరాలకు కాటన్‌, గన్ని బ్యాగులు వాడాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె అభిషేక్‌గౌడ మాట్లాడుతూ పరిసరాల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, రోడ్లపై వ్యర్థాలు వేయరాదని చెత్త కనిపిస్తే డస్ట్‌బిన్లో వెయ్యాలన్నారు. ఇతర న్యాయమూర్తులు,జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి, అసిస్టెంటు కలెక్టర్‌ సిహెచ్‌ శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి,ఎఎస్పీ వై ప్రసాదరావు, ఇన్‌ఛార్జి డీఆర్వో, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటి, ఆర్డీవో కె.లక్ష్మీ ప్రసన్న, బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంటు ఎన్‌.కృష్ణారావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:48 AM