Share News

ఇటుకతో కొట్టి.. వేడినూనె పోసి..ప్రియుడిని హత్య చేసిన మహిళ

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:48 AM

ప్రియుడు తనను దూరం పెడుతుండడాన్ని ఓ మహిళ సహించలేకపోయింది. అతడి తలపై ఇటుకతో కొట్టింది. ఆపై నూనె సలసలా మరిగించి అతడి ఒంటిపై పోసి హత్య చేసింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుందీ దారుణం.

ఇటుకతో కొట్టి.. వేడినూనె పోసి..ప్రియుడిని హత్య చేసిన మహిళ

  • ఆపై విషం తాగి ఆత్మహత్యాయత్నం

గరివిడి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రియుడు తనను దూరం పెడుతుండడాన్ని ఓ మహిళ సహించలేకపోయింది. అతడి తలపై ఇటుకతో కొట్టింది. ఆపై నూనె సలసలా మరిగించి అతడి ఒంటిపై పోసి హత్య చేసింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుందీ దారుణం. గరివిడి పోలీసుల కథనం మేరకు.. విశాఖపట్నంలోని మల్కాపురం బాలాజీనగర్‌లో నివసిస్తున్న జీవీఎంసీ స్వీపర్‌ దన్నాల శ్రీను (36)కు విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో కొద్దిపాటి భూమి ఉంది. దాన్ని చూసుకునేందుకు అప్పుడప్పుడు వచ్చేవాడు. అదే గ్రామానికి చెందిన దన్నాల రాములమ్మతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె శ్రీనుకు వరసకు చిన్నమ్మ అవుతుంది. 8నెలల క్రితం ఇద్దరూ రాములమ్మ ఇంట్లోనే దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి రాములమ్మ తనను విశాఖపట్నం తీసుకువెళ్లమని తీవ్ర ఒత్తిడి చేస్తున్నా.. శ్రీను వాయిదా వస్తున్నాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రాములమ్మ సిమెంట్‌ ఇటుకతో శ్రీను తలపై పలుమార్లు దాడి చేసింది. తర్వాత నూనె మరగబెట్టి ఒంటిపై పోసి.. ప్రమాదం జరిగిందని చిత్రీకరించేందుకు యత్నించింది. శ్రీను మృతిచెందిన తర్వాత.. ఆమె చీమల మందు నీటిలో కలిపి తాగేసింది. గమనించి రాములమ్మను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 05:49 AM