రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధిపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
ABN , Publish Date - Jul 04 , 2026 | 07:13 PM
రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
అమరావతి: రాష్ట్రంలో రొయ్యల సాగులో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైన నివారణ చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు సంబంధిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మహదేవిపట్నంలోని ప్రభావిత రొయ్యల చెరువును అధికారులు సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. అక్కడి నుంచి నీరు, రొయ్యలు, ఫీడ్, ఫీకల్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు.
రొయ్యల నమూనాలను కైకలూరు ప్రయోగశాలకు, నీటి నాణ్యత పరీక్షల కోసం భీమవరం ప్రయోగశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే సమస్యపై సమగ్ర అధ్యయనం కోసం MPEDA, CIBA, NBFGR, NASPAD, ఫిషరీస్ యూనివర్సిటీ వంటి సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శాస్త్రీయ సూచనల మేరకు వ్యాధి నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
Also Read:
మెల్‌బోర్న్ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి డెత్ వార్నింగ్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్