ఏసీబీ డీఎస్పీనంటూ ఘరానా మోసం!
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:43 AM
ఏసీబీ డీఎస్పీ అంటూ ఫోన్‌చేసి అధికారులు, సిబ్బందిని బెదిరించిన ట్రాప్‌లో ఓ వీఆర్వో చిక్కుకున్నాడు. ఆగంతకుడి బెదిరింపులకు భయపడి రూ.1.30 లక్షలు చెల్లించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తాను మోసపోయినట్లు గుర్తించిన సదరు వీఆర్వో శనివారం పోలీసులను ఆశ్రయించారు.
అరెస్టు చేస్తామంటూ ఫోన్‌లో అధికారులకు బెదిరింపు
ట్రాప్‌లో చిక్కుకున్న ఓ వీఆర్వో.. 1.30 లక్షల చెల్లింపు
కాకినాడ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
గొల్లప్రోలు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఏసీబీ డీఎస్పీ అంటూ ఫోన్‌చేసి అధికారులు, సిబ్బందిని బెదిరించిన ట్రాప్‌లో ఓ వీఆర్వో చిక్కుకున్నాడు. ఆగంతకుడి బెదిరింపులకు భయపడి రూ.1.30 లక్షలు చెల్లించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తాను మోసపోయినట్లు గుర్తించిన సదరు వీఆర్వో శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీని అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ దివిజ, ఎంపీడీవో సెలట్‌రాజు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావుతోపాటు పలువురు రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపల్ సిబ్బందికి ఈ నెల 10న ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఆగంతకుడు ఇదే రీతిలో మరికొందరికి ఫోన్ చేసి బెదిరించి, డబ్బులు దోచుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు పట్టణంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న మంగ, వెంకటపతి, మాణిక్యాలరావు, పరమేశ్వరరాజులకు నిందితుడు ఫోన్ చేసి బెదిరించాడు. భయపడ్డ వెంకటపతి ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లించాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి