Share News

తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేసిన ఓటరు!

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:30 AM

‘అయ్యా.. మీరిచ్చిన డబ్బులు రూ.1000. మీరే తీసుకోండి. డబ్బులు తీసుకుని ఓటు వేసే వారం కాదు సుమా. ధన్యవాదాలు’ అని ఓ కాగితంపై రాసి.. ఓటుతోపాటు బ్యాలట్‌ బాక్సులో పడేశాడో ఓటరు

తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేసిన ఓటరు!
cash

‘అయ్యా.. మీరిచ్చిన డబ్బులు రూ.1000. మీరే తీసుకోండి. డబ్బులు తీసుకుని ఓటు వేసే వారం కాదు సుమా. ధన్యవాదాలు’ అని ఓ కాగితంపై రాసి.. ఓటుతోపాటు బ్యాలట్‌ బాక్సులో పడేశాడో ఓటరు. ఏ పార్టీ అభ్యర్థో తనకు ఇచ్చిన రెండు రూ.500 నోట్లను ఆ కాగితానికి అటాచ్‌ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తున్న సందర్భంగా ఈ ‘నోట్‌’ దొరకగా.. ఈ విషయం సోమవారం వెలుగుచూసింది. - చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

ఇవి కూడా చదవండి..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్

Updated Date - Nov 17 , 2026 | 05:16 AM