Share News

విజయనగరం జిల్లాలో విషాదం.. గెడ్డలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:16 PM

విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం వి.పి. రేగ గ్రామంలో గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

విజయనగరం జిల్లాలో విషాదం..  గెడ్డలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
Children Drowning

విజయనగరం, నవంబరు 24: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం వి.పి. రేగ గ్రామంలో గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులను ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7)గా గుర్తించారు. చిన్నారులిద్దరూ ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి. తమ పిల్లలు తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.


ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 01:21 PM