Share News

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌‌లో రూ.4,894 కోట్ల ఆదాయం: జీఎం సందీప్ మాథుర్

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:16 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌‌లో రూ.4,894 కోట్ల ఆదాయం: జీఎం సందీప్ మాథుర్
South Coast Railway GM Sandeep Mathur

విశాఖపట్నం, ఆగస్టు15: దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు. శనివారం 80వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని రైల్వే సిబ్బంది, అధికారులతోపాటు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీఎం సందీప్ మాథుర్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో18వ జోనల్ హెడ్ క్వార్టర్‌గా 2026 జూన్ 1వ తేదీన ప్రారంభమైందని గుర్తు చేశారు. దీంతో ఈ రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.


జోన్ పరిధిలోని 1070 లోకోమోటివ్‌లలో ఇప్పటికే ప్రమాదాల నివారణకు 719 లోకోమోటివ్‌లకు కవచ్ ఏర్పాటు చేశామని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులోభాగంగా డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులను రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.54,479 కోట్లు ఇప్పటికే వెచ్చించి పనులు చేపట్టామని ఆయన వివరించారు. విశాఖపట్నం యార్డ్ మోడలింగ్ ప్రాజెక్టుకు రూ.299 కోట్లు ఆమోదం లభించిందన్నారు. దీంతో 6 అదనపు లైన్లు, 6 అదనపు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుంతకల్- బళ్లారి డివిజన్‌లో నాలుగు లైన్లు నిర్మాణం కోసం రూ.1,205 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు.

Updated Date - Aug 15 , 2026 | 12:00 PM