Share News

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:10 PM

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్‌గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి రెండు నుంచి మూడు నెలల గడువు నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు
Raghurama Krishnam Raju

విశాఖపట్నం: శాసనసభ పిటిషన్స్ కమిటీ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమర్పించిన పిటిషన్లపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు.


ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను నేరుగా సమావేశానికి తీసుకువచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ కృషి చేస్తోందన్నారు.


విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పలు ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వివిధ అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు లాగా ఎమ్మెల్యేలు మరింత చొరవ చూపి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో చర్చించిన సమస్యలను వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని రఘురామ స్పష్టం చేశారు.


Also Read:

గుడ్లతో ఈ ఆహారాలు తింటే సమస్యలే!

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే

Updated Date - Jun 23 , 2026 | 04:28 PM