కుప్పకూలిన డ్రోన్.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:35 AM
అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పాడేరు, మార్చి 27: అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రెడ్ వింగ్ సంస్థ, ప్రభుత్వం సంయుక్తంగా డ్రోన్ సేవలను పరిశీలిస్తున్నాయి. రక్తం నమూనాలు, అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టారు. ఆ క్రమంలో బొయితిలి గ్రామ పరిసరాల్లో ఎగురుతూ కూలిపోయింది. ఈ డ్రోన్.. చెట్లపై పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.