Share News

విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘కియాస్క్’ను ప్రారంభించిన హోంమంత్రి అనిత

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:13 PM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు, పౌరులకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసేలా ‘మీ పోలీస్‌.. మీ ఫ్రెండ్‌’ డిజిటల్‌ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ అందుబాటులోకి వచ్చింది..

విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘కియాస్క్’ను ప్రారంభించిన హోంమంత్రి అనిత
Visakhapatnam Railway Station

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: నగరంలోని రైల్వే స్టేషన్‌ వద్ద ‘మీ పోలీస్‌.. మీ ఫ్రెండ్‌’ డిజిటల్‌ ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పౌరులకు పోలీసు సేవలను మరింత సులభతరం, పారదర్శకంగా, వేగవంతంగా అందించాలనే ఉద్దేశంతో ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కియాస్క్‌ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వాయిస్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడే పౌరులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే కియాస్క్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కియాస్క్‌ను PGRS (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌) తో అనుసంధానం చేసినందున ఫిర్యాదులపై ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని పేర్కొన్నారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో భద్రత ఎంతో కీలకమని, మహిళల భద్రత విషయంలో విశాఖ ముందంజలో ఉందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

Read Latest AP News And Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:00 PM