Share News

గాజువాక ఏజెంట్‌పై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:11 AM

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కంబోడియా తరలించి, అక్కడ సైబర్‌ నేరాలకు పాల్పడే గ్యాంగ్‌లకు అప్పగిస్తున్న ప్రధాన ఏజెంట్‌ చుక్కా రాజేశ్‌పై విశాఖ పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలుచేశారు.

గాజువాక ఏజెంట్‌పై పీడీ యాక్ట్‌

  • నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టు

  • సెంట్రల్‌ జైలుకు తరలింపు

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కంబోడియా తరలించి, అక్కడ సైబర్‌ నేరాలకు పాల్పడే గ్యాంగ్‌లకు అప్పగిస్తున్న ప్రధాన ఏజెంట్‌ చుక్కా రాజేశ్‌పై విశాఖ పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలుచేశారు. రాజేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌పై సెంట్రల్‌జైలుకు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గాజువాక ప్రాంతానికి చెందిన రాజేశ్‌ ఒక ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాడు. మయన్మార్‌, కంబోడియా, వియత్నాం, లావోస్‌ వంటి దేశాల్లో భారీ జీతంతో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షలు తీసుకుని ఫ్లైట్‌ టికెట్‌, బిజినెస్‌ వీసా ఏర్పాటుచేసి కంబోడియాలోని ఏజెంట్లకు అప్పగించేవాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఏజెంట్లు వారిని సైబర్‌ స్కామ్‌ చేసే ఏజెంట్లకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఇలా సైబర్‌ ముఠాల చేతిలో బందీలుగా చిక్కిన అనేకమంది తమను కాపాడాలంటూ వీడియోల ద్వారా నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చిని కోరారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించి.. ప్రత్యేక బృందాలను కంబోడియా, వియత్నాం, మయన్మార్‌ దేశాలకు పంపించి వారిని కాపాడారు. బాధితులిచ్చిన వివరాల ఆధారంగా చుక్కా రాజేశ్‌ ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించినట్టు తేలడంతో అతనిపై పలు కేసులు నమోదుచేశారు. తాజాగా పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:11 AM